ముంబై చర్చలు కేవలం ఫేస్ సేవింగ్ చర్యేనంటూ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపాటు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో కొత్తగా సాధించిందేమీ లేదని, ప్రభుత్వ పరువు కాపాడుకునే చర్యగా మాత్రమే మిగిలిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ్మిడిహట్టి ఎత్తుపై కమిటీ వేస్తామనడం ప్రజలను మభ్యపెట్టడమేనని సోమవారం ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర చేపట్టే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నీటి కొరత ముప్పు పొంచివున్నదని, నీటి హక్కులను కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు.