సినిమా అప్డేట్: చంద్రయాన్ సినిమాలో హీరో పాత్రను పరిచయం చేసిన చిత్ర యూనిట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కుతున్న చంద్రయాన్ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసిన మేకర్స్, హీరో శివ కుమార్ దీకొండ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మందమర్రి నుంచి చందమామ వరకు సాగే ఈ గ్రామీణ అడ్వెంచర్ కామెడీ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయించనుంది అని చిత్ర బృందం స్పష్టం చేసింది.