తుఫాన్ ప్రభావం: ఏపీలో పునరుద్ధరిస్తున్న విద్యుత్ సరఫరా అని సీఎండీ వెల్లడి
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి తెలిపారు. తుఫాన్ కారణంగా ఎనిమిది వందల యాభై ఏడు గ్రామాల్లో అంతరాయం కలగగా, ఇప్పటికే ఏడు వందల ఏడు గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో రాత్రికి పనులు పూర్తి చేస్తామని, ప్రజలు తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.