వీరఘట్టం: చదువుకోలేనన్న మనస్తాపంతో పురుగు మందు తాగి యువతి మృతి
రిపోర్టర్: హరి
స్థలం: వీరఘట్టం
ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేక సతమతమైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై ఎస్.షణ్ముఖరావు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం గడగమ్మ గ్రామానికి చెందిన కె.నవ్య బీఫార్మసీ పూర్తి చేసి ఎంఫార్మసీలో చేరేందుకు ఫీజు అధికంగా ఉండటంతో మనస్తాపం చెందింది. ఈనెల 1న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగగా శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.