మృతుల కుటుంబాల పరామర్శ: మల్యాలలో నేతల సానుభూతి

రిపోర్టర్: Ajay (దిశ) స్థలం: మల్యాల

మల్యాల మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జవ్వాజి లచ్చిరెడ్డి, ముకుందు లక్ష్మి కుటుంబాలను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు ధైర్యం చెప్పారు.