టెలికాం భద్రతపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవ సమీక్ష
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: గుంటూరు
టెలికాం భద్రతపై టెలికాం శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి మరియు గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవ సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఇ-సిమ్ బాక్స్ హార్డ్వేర్ ఆధారిత మోసాలు వంటి పెరుగుతున్న నూతన ముప్పులపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖతో సమన్వయం పెంపొందించుకోవడానికి మరియు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న రాష్ట్రాలను అభినందించడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు సమీక్షించారని ఆయన తెలిపారు.