ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా అంటూ విద్యాసాగర్ స్పష్టత

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఏపీఎన్జీవో అసోసియేషన్ పని చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్జీవో భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుకు ప్రభుత్వం జీవో 7 విడుదల చేయడంపై సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.