యలహంక ఆస్తి వివాదంపై పేర్ని నాని వ్యాఖ్యలు: షర్మిలపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని స్పందిస్తూ వైఎస్ షర్మిల వాదనలను తీవ్రంగా తప్పుబట్టారు. బెంగళూరులోని యలహంక ఆస్తి జగన్ కు చెందినది కాదని, తాజ్మహల్ను చూసి తనదని అడిగితే ఇచ్చేస్తారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆస్తి పంపకాలపై ఇరువర్గాల మధ్య నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.