అక్టోబరు నెలాఖరుకు వరికపూడిశెల డీపీఆర్ పూర్తి చేయాలి
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
పల్నాడు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరందించే వరికపూడిశెల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన భూసేకరణ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ సంకల్పమని తేల్చిచెప్పారు.