విజయనగరం: జొన్నవలసలో పైడితల్లి సిరిమాను వృక్షాలకు భక్తుల వైభవంగా పూజలు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా జొన్నవలసలో ప్రసిద్ధి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలకు భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం సిరిమానును గొడ్డలితో తాకే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెదేపా కార్యాలయ కార్యదర్శి పూసపాటి రాజేశ్ బాబు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని అధికారులు వెల్లడించారు.