ప్రజావాణి అర్జీలను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని ఇన్ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఆయన మొత్తం 83 అర్జీలను స్వీకరించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 53 విజ్ఞప్తులు అందగా, మిగతావి వివిధ విభాగాల నుంచి వచ్చాయని అధికారులు వెల్లడించారు.