పిఠాపురంలో అంధ విద్యార్థిని కోరిక తీర్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రిపోర్టర్: మహేష్ స్థలం: కాకినాడ

పిఠాపురం పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను స్వాతి అనే అంధ విద్యార్థిని కలిశారు. పవన్ సమక్షంలో వేమన పద్యం పాడాలనే తన చిరకాల కోరికను ఆమె ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ఆ బాలికను వేదికపైకి ఆహ్వానించి, ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. అనంతరం స్వాతి మధురంగా ఆలపించిన వేమన పద్యాన్ని విని మురిసిపోయి, ఆమెను మనస్ఫూర్తిగా అభినందించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.