9 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూముల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 9 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్‌పై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వైకాపా హయాంలో ఫ్రీహోల్డ్ చేసిన 13 లక్షల ఎకరాలను పరిశీలించగా, అవకతవకలు జరిగిన మిగతా 4 లక్షల ఎకరాలపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.