మున్సిపల్ ప్రైవేటీకరణ విధానంపై కార్మికుల నిరసన గర్జన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస మున్సిపాలిటీలో సేవల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్క్ కాంట్రాక్టు పేరుతో ప్రజలపై భారాలు మోపడం తగదన్నారు. మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.