వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు రూ. నలభై కోట్ల సుపారీ కోణంలో విచారణ
రిపోర్టర్: మహేష్
స్థలం: కడప
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య వెనుక ఏకంగా నలభై కోట్ల రూపాయల సుపారీ ఒప్పందం జరిగిందనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, నిందితులను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సీబీఐ దర్యాప్తునకు తోడు మనీ లాండరింగ్ కోణంలో కూపీ లాగుతుండటంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.