బ్రిక్స్ సదస్సులో ఘన విజయం సాధించిన భారత్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో సదస్సు తొలి రోజే ఉమ్మడి ప్రకటన ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం మధ్య భిన్నాభిప్రాయాలను తొలగిస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తీవ్ర కసరత్తు చేసి ఈ ఒప్పందాన్ని సాధించారు. ఈ సమావేశంలో మోదీ, జిన్‌పింగ్, పుతిన్‌ల ప్రత్యేక కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.