తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్ నియామకం

రిపోర్టర్: శివ స్థలం: తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా విభాగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన లోకనాథం స్థానంలో, శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్‌ను నియమిస్తూ టీటీడీ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల రిసెప్షన్-1 డిప్యూటీ ఈఓగా పనిచేసిన ఆయనకు తాజాగా ఆలయ బాధ్యతలు అప్పగించడంతో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.