భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రంలోని పాట విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి నిర్మించిన ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాటను విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణం, తండ్రి ప్రేమను చాటే భావోద్వేగాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.