ది ప్యారడైజ్ సినిమాలో కయాదు లోహర్ పాత్రపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ది ప్యారడైజ్ చిత్రంలో కయాదు లోహర్ పోషించిన సుబ్బు పాత్ర తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నట్లు సినీ ప్రేక్షకులు తెలిపారు. కుటుంబ అప్పులు తీర్చేందుకు ఆమె బీ గ్రేడ్ చిత్రాల్లో నటించడం, ఆ సన్నివేశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఆ పాత్రను చూపించిన తీరు, హీరో చెప్పే సంభాషణలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు పాత్ర వెనుక ఉన్న భావోద్వేగాన్ని ప్రస్తావిస్తున్నారు.