మున్సిపల్ ఎన్నికల వేళ కాకినాడ జిల్లాలో పోలీసుల భారీ కవాతు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కాకినాడ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించినట్లు కేకినాడ పోలీసులు వెల్లడించారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్థానికులు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.