పాంచ్కులా పాఠశాలలో దారుణం: చిన్నారిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్ సస్పెన్షన్
రిపోర్టర్: గోపి
స్థలం: పాంచ్కులా
పాంచ్కులాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల కిండర్ గార్టెన్ చిన్నారిపై ఎనిమిదేళ్ల బాలుడు దారుణంగా దాడి చేసిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్ నీలును సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 28న ఖాళీ గదిలో జరిగిన ఈ అఘాయిత్యం సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా, పాఠశాల అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోంది. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ తో పాటు క్లాస్ టీచర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.