మున్సిపల్ ఎన్నికల వేడి: మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం మినహా మిగిలిన నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్లు పార్టీ స్పష్టం చేసింది.