కూలిన వంతెనను వెంటనే పునర్నిర్మించాలని తమ్మినేని సీతారాం డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నందిగాం
తుఫాను వర్షాల ధాటికి నందిగాం మండలం కొత్త అగ్రహారం వద్ద వంతెన కూలిపోయి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిశీలించారు. బెండిగేట్, టెక్కలిపట్నం మీదుగా పర్లాకిమిడి వెళ్లే ప్రధాన రహదారి తెగిపోవడంతో ప్రయాణ దూరం పెరిగిందని వారు వెల్లడించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి వంతెన పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.