ఆరోగ్య సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోషణ మాసం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రేణిగుంట

రేణిగుంట ఐసిడిసి ప్రాజెక్టు పరిధిలోని చెల్లూరు గ్రామంలో సీడీపీఓ కే కృష్ణవేణి అధ్యక్షతన తొమ్మిదవ పోషణ మాసం-2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ తొమ్మిది నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో వైవిధ్యమైన పోషకాహారం, అంగన్వాడీలో వేడిగా వండిన పరిశుభ్రమైన భోజనంపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబానికి పోషకాహార సందేశాన్ని చేరవేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.