'ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?': సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ వర్గాలు మండిపడ్డాయి. నిరసన తెలుపుతున్న ఆమె జుట్టు పట్టుకొని లాగుతూ పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నేతలు నిలదీశారు.