ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రాజీనామా
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
ఐపీఎల్ 2026 సీజన్ లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే తప్పుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్ లో జట్టు కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జట్టు యజమాని నీతా అంబానీ ఆయన సేవలను ప్రశంసించగా, త్వరలోనే కొత్త కోచ్ నియామకంపై యాజమాన్యం కసరత్తు చేస్తోంది.