థాయిలాండ్ అంతర్జాతీయ లీడర్ షిప్ అవార్డు అందుకున్న ప్రొఫెసర్ ప్రకాష్ దివాకరన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఇండియా
థాయిలాండ్ ఇంటర్నేషనల్ లీడర్‌షిప్ అవార్డు 2026 వేడుకలో భారతదేశం తరఫున హిమాలయన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ దివాకరన్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. విలువల ఆధారిత నాయకత్వం, సమాజానికి సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఈ సదస్సులో నొక్కిచెప్పారు. ఈ వేడుకలో పలు దేశాలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.