అనాథ పిల్లల మధ్య డాక్టర్ లక్ష్మి ఆకుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ ప్రాంతంలో డాక్టర్ లక్ష్మి ఆకుల జన్మదిన వేడుకలను అనాథ పిల్లల మధ్య నిర్వహించారు. అన్న ఫౌండేషన్ శ్రీనివాస్, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు విలేకరులతో కలిసి కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. ప్రత్యేక చిన్నారుల సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో ఆమె సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.