నర్సీపట్నంలో చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజల బ్రహ్మరథం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని కొత్త వీధిలో రుత్తల చిన్న ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికి హారతులు ఇచ్చి మద్దతు తెలిపారు. ఈ ప్రచార ర్యాలీలో వివిధ వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.