చింతలపల్లిలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
పిల్లల ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నిరోధక టీకాలు ఎంతో కీలకమని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. శనివారం చింతలపల్లి గ్రామంలో చిన్నారులకు పోలియో తదితర వ్యాధుల నివారణకు టీకాలు వేశారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా మూడేళ్లలోపు పిల్లలకు అవసరమైన టీకాలు వేయించాలని సూచించారు. టీకాల ద్వారా చిన్నారులను పలు ప్రాణాంతక వ్యాధుల నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చని వైద్య సిబ్బంది వివరించారు.