శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అరుదైన బిగ్‌ఫిన్ స్క్విడ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలకు అత్యంత అరుదైన బిగ్‌ఫిన్ స్క్విడ్ సజీవంగా కనిపించింది. కాలిఫోర్నియా తీరంలో రెండు మైళ్ల లోతులో రిమోట్ ద్వారా నడిచే వాహనం సాయంతో పరిశోధన చేస్తుండగా ఈ వింత జీవి కెమెరాకు చిక్కింది. అత్యంత పొడవాటి స్పర్శకాలు, దెయ్యం లాంటి శరీర నిర్మాణంతో ఉన్న ఈ జీవిని చూడటం శాస్త్రవేత్తలకు ఇదే మొదటిసారి.