తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం సాయంత్రం స్పీకర్ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 8 రోజులు జరిగిన ఈ సమావేశాలలో 51 గంటల 52 నిమిషాలపాటు సభ సజావుగా సాగింది. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులకు, మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. తొలిరోజే అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతల నిరసనలు, ఘర్షణలతో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే.