గ్రూప్-1 అక్రమాలపై సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. 734 ఓఎమ్మార్ షీట్లలో 718 పత్రాలను మార్చేశారు. ఎంపికైన 165 మందిలో 160 మంది జవాబు పత్రాల్లో దిద్దుబాట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరిశీలనలో వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా వైట్‌నర్ వినియోగించడం, ఒరిజినల్ షీట్లను నాశనం చేసి డూప్లికేట్లు ముద్రించడం కలకలం రేపుతోంది.