ఫిన్లాండ్లో గూగుల్ డేటా సెంటర్ కలకలం: అడవి నరికివేతతో గ్రామాలకు తోడేళ్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఫిన్లాండ్

ఫిన్లాండ్లో గూగుల్ చేపట్టిన భారీ డేటా సెంటర్ నిర్మాణ ప్రాజెక్టు పర్యావరణ వివాదానికి దారితీసిందని ది గార్డియన్ నివేదించింది. ముహోస్, కజాని ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే సుమారు పదమూడు వందల ఎకరాల అడవిని తొలగించడంతో వన్యప్రాణులు గ్రామాల వైపు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రభావ అంచనా పూర్తి కాకుండానే చెట్లు నరకడంతో అధికారులు పనులను నిలిపివేశారని, గూగుల్ సంస్థ ఈ ఘటనపై క్షమాపణలు కోరిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.