వైఎస్ జగన్ పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు: కొత్త పార్టీ ప్రకటనపై స్పష్టత
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
వైసీపీలో ఉన్న సమయంలో కొందరి తప్పుడు ఫిర్యాదుల వల్ల తాను జగన్ చేత అవమానాలకు గురయ్యానని మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆత్మగౌరవం చంపుకోలేకనే తాను బయటకు వచ్చానని, సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు ఈనెల పదకొండో తేదీన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ కేవలం రెండు కులాలు లేదా కుటుంబాలకు చెందినది కాదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు.