భారీ వర్షాలకు కూలిన గిరిజనుడి ఇంటి గోడ
రిపోర్టర్: MADHIRI CHANTIBABU
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలంలోని ధారకొండ పంచాయతీ పెబ్బంపల్లిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం గిరిజనుడు చిలకల లక్ష్మణరావుకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇల్లు దెబ్బతినడంతో ఆ కుటుంబం నిరాశ్రయులైంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణరావు కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.