చైనాలో ముఖాలను అద్దెకు ఇస్తూ లక్షల్లో ఆర్జిస్తున్న యువత

రిపోర్టర్: నరేష్ స్థలం: చైనా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా మారుతున్న తరుణంలో చైనాలో వినూత్నమైన ఫేస్ రెంటల్ ట్రెండ్ అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ రంగంలో ఏఐ యాడ్స్ కోసం సాధారణ ప్రజల ముఖ కవళికలను అద్దెకు తీసుకుంటున్న కంపెనీలు చట్టపరమైన ఒప్పందాలతో రూ. 14 లక్షల వరకు భారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.