భక్తిపారవశ్యపు వేలంలో స్వామివారి లడ్డూను దక్కించుకుని ధన్యుడైన కందుల రోహిత్

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కంపసముద్రం కందులవారిపల్లి గ్రామంలోని పాత రామాలయం వద్ద తొలిసారిగా నిర్వహించిన వినాయక స్వామివారి లడ్డూ వేలంపాట అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేలంపాటలో కందుల రోహిత్ రూ.71,116 వెచ్చించి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం అనంతరం గ్రామస్తులు రోహిత్ను మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లగా, అనంతరం ఆయన ఆ ప్రసాదాన్ని తిరిగి ఆలయానికి చేర్చి భక్తులందరికీ పంపిణీ చేశారు. దేవుని సేవలో భాగం కావడం ఆనందంగా ఉందని రోహిత్ తెలపగా, గ్రామస్తులు ఆయన కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని దీవించారు.