శ్రీ సిటీలో సతీష్ మండువ పర్యటన: ఏపీ పారిశ్రామిక వృద్ధిపై ప్రశంసలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల నార్త్ అమెరికా ప్రిన్సిపల్ లైజన్ సతీష్ మండువ శ్రీ సిటీలో పర్యటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ సిటీ అభివృద్ధి వెనుక వ్యవస్థాపకుడు రవీంద్ర సన్నారెడ్డి దార్శనికత ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పారిశ్రామిక వృద్ధి వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. డైకిన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ విస్తరిస్తున్నాయని తెలిపారు.