గుంటూరులో ఇంటిగ్రేటెడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: గుంటూరు
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీలో అరుదైన వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన కారణాలను గుర్తించేందుకు సమగ్ర జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్.ఏఐ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే గళ్లా మాధవితో కలిసి ప్రారంభించారు. ఇకపై స్థానికంగానే క్యాన్సర్ రోగులకు రూ.25 వేల వరకు ఖర్చయ్యే పరీక్షలను ఉచితంగా చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు.