జీతంలో సగం అద్దెకే: గురుగ్రామ్ ఉపాధ్యాయురాలి వినూత్న నిర్ణయంపై చర్చ
రిపోర్టర్: సతీష్
స్థలం: గురుగ్రామ్
జీతంలో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని ఇంటి అద్దెకే ఖర్చు చేస్తున్నట్లు గురుగ్రామ్ పాఠశాల ఉపాధ్యాయురాలు శక్తి ధర్నీ పాండే వెల్లడించారు. సుదూర ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరికినా, ప్రయాణ సమయం వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పాఠశాలకు సమీపంలోనే ఇల్లు తీసుకున్నట్లు తెలిపారు. డబ్బు పొదుపు చేయడం కంటే తన ప్రశాంతత, సమయం, శక్తి ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు.