కర్ణాటక నీట్ ఎమ్‌డీఎస్ ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపు విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

కర్ణాటక నీట్ ఎమ్‌డీఎస్ 2026 మొదటి విడత ఫైనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను కేఈఏ విడుదల చేసింది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు తమ ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఛాయిస్-1 లేదా 2 ఎంచుకున్న వారు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఫీజు చెల్లించాలి. ఛాయిస్-1 ఎంచుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటలలోపు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.