మురసు తుఫాను ముప్పు: అమరావతి ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్షలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

మురసు తుఫాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పొరుగు రాష్ట్రాల సహాయంతో విద్యుత్ పునరుద్ధరణ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.