మెట్రో ప్రయాణికులకు భారీ ఊరట: కామన్ పాస్ ధరలు తగ్గింపునకు నిర్ణయం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత చేరువ చేసే లక్ష్యంతో కామన్ పాస్ ధరలను భారీగా తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు తెలిపారు. అధిక ధరల కారణంగా ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో, రోజువారీ పాస్ ధరను రూ. 325కు మరియు నెలవారీ పాస్ ధరను రూ. 4,000 నుంచి రూ. 4,500 మధ్యకు కుదించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి.