రోడ్డు ప్రమాద బాధితులను కాపాడుతూ స్పందిస్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
రిపోర్టర్: మహేష్
స్థలం: Dammapeta
అశ్వారావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ రోడ్డు ప్రమాద బాధితులను కాపాడుతూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారని స్థానికులు తెలిపారు. తన ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి క్షతగాత్రులను తన వాహనంలోనే ఆసుపత్రికి తరలిస్తున్నారని పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట ప్రాంతాలలో జరిగిన వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆయన తక్షణ వైద్య సహాయం అందించారని వెల్లడించారు. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఎమ్మెల్యే చేస్తున్న ఈ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని వివరించారు.