జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ అమలు చేయాలి
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం: జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో యాభై శాతం ఫీజు రాయితీని తక్షణమే అమలు చేయాలని TWJF అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ డిమాండ్ చేశారు. జీవోలు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. కొన్ని విద్యాసంస్థలు పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.