బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు: ప్రయాణికులకు త్వరలో భారీ ఊరట

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

బెంగళూరు నుంచి ముంబైకి కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నూతన సర్వీసు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి నూట పద్దెనిమిది కిలోమీటర్ల దూర పదహారు గంటల్లోనే ఈ రైలు చేరుకుంటుందని, దీనివల్ల ప్రయాణికులకు ఆరు గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.