బెంగళూరులో కలకలం: పోలీసులపై దురుసు ప్రవర్తనపై ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Bengaluru

బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పబ్ తనిఖీలకు వెళ్లిన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగి, వారిని దూషించిన ఘటనలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ సహా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ పోలీసులు స్పష్టం చేశారు. రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.