అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు!

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆసరా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ మరియు దివ్యాంగ పింఛన్ల కొరకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ అంతటా పరిశీలన చేపట్టి, అక్టోబర్ నుండి అర్హులైన కొత్త వారికి పింఛన్లు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.