గొల్లలములగాం ఎంపీటీసీ ఎన్నికల్ లో చరిత్ర సృష్టించిన తెదేపా అభ్యర్థి దుర్గ భవాని
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చీపురుపల్లి
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం ఎంపీటీసీ ఎన్నికల్ లో తెదేపా అభ్యర్థి చందక దుర్గ భవాని ఘన విజయం సాధించారని స్థానిక నాయకులు తెలిపారు. ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీల ఏకపక్ష ఆధిపత్యం ఉండే ఈ సమస్యాత్మక గ్రామంలో తొలిసారి తెదేపా జెండా ఎగిరిందని వారు పేర్కొన్నారు. సమీప ప్రత్యర్థి కలిశెట్టి పద్మపై 146 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో తెదేపా శ్రేణుల్ లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు.